Neeve Hrudaya Saradi

  • 715
  • 18
  • 1
  • 10
  • 2
  • 1

Hosanna Ministries

Lyrics

నా హృదయ సారథి
పల్లవి:
నీవే హృదయ సారధి - ప్రగతికి వారధి
నీ స్నేహమే సౌభాగ్యము - సంక్షేమ సంతకం
నా పాటకే సౌందర్యము - నీవే యేసయ్యా

1: మదిలో చేదుజ్ఞాపకాల విలయవేదిక కూల్చి
చిగురాశల దిశగా నను పయనింపజేసినా
నీ మాటలు స్థిరపరచెను విశ్వాస ప్రేమలో
కలనైనా అనుకోని అనురాగ బంధమైతివే
నీవే హృదయ||

2: నీవు లేని జీవితం ప్రళయసాగరమే
దిక్కుతోచని సమయములో నీవేదిక్సూచివై
చుక్కానిగ నడిపించుము ఆత్మీయ యాత్రలో
కనుపాపగ నను కాచిన నామంచి కాపరి
" నీవే హృదయ
3: చేరనైతి కోరనైతి స్నేహ సౌధము
చిరుదివ్వెగ దరిచేరి చేర్చావు సన్నిధి
చావైనా బ్రతుకైనా నీకోసమే ప్రభు
చాటింతు నీ ప్రేమను ప్రణుతింతు ప్రేమ సాగరా
॥ నీవే హృదయ||

00:00

very nice

00:00

good Song

:
/ :

Queue

Clear